నేతన్నలారా ఆశీర్వదించండి అండగా ఉంటా
—-రావిరాల రాజేంద్రప్రసాద్
చండూర్ జూలై 5 (న్యూస్ వార్ ) చేనేత సహకార సంఘం ఎన్నికల పోటీలో ఉన్న తనను గెలిపించాలని రావిరాల రాజేంద్రప్రసాద్ చేనేత కార్మికులను అభ్యర్థించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సేవాదల్లో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తను అధికార పార్టీ అండదండలతో నేత కార్మికులకు ప్రభుత్వం నుంచి అందించబడుతున్న పథకాలను ప్రోత్సాహకాలను అందించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. పద్మశాలి బిడ్డగా చేనేత కార్మికులకు, నావంతు సహాయ సహకారం అందించాలనే దృడ సంకల్పంతో ముందుకు వస్తున్న నాకు మి అందరి ఆశీస్సులు ఓట్ల రూపంలో అందించి నన్ను గెలుపించాలని ఆశిస్తున్నాంటూ.
ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.
తప్పకుండా మాట నిలబెట్టుకుంటాననీ అభ్యర్థించారు.